కనిమొళికి చెన్నైలో ఘన స్వాగతం!

  • 2జీ కుంభకోణంలో నిర్దోషిగా విడుదల 
  • తీర్పిచ్చిన రెండు రోజుల తరువాత చెన్నైకి
  • ఘనస్వాగతం పలికిన స్టాలిన్ తదితరులు
2జీ కుంభకోణం కేసులో నిర్దోషిగా బయటపడిన కరుణానిధి కుమార్తె కనిమొళి, టెలికం శాఖ మాజీ మంత్రి ఏ రాజాలకు చెన్నైలో ఘన స్వాగతం లభించింది. పటియాలా హౌస్ కోర్టు తీర్పు వెలువడిన రెండు రోజుల తరువాత వీరు చెన్నైకి రాగా, విమానాశ్రయంకు డీఎంకే శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేస్తూ స్వాగతం పలికాయి. డప్పు వాయిద్యాలతో సందడి చేస్తూ, నృత్యాలతో వారిని ర్యాలీగా గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి తీసుకెళ్లారు. కనిమొళి సోదరుడు స్టాలిన్ తో పాటు పలువురు డీఎంకే నేతలు విమానాశ్రయానికి వెళ్లిన వారిలో ఉన్నారు.
Go Back to Shorts
Kanimozhi
A Raja
Stalin
2G Scam

More Telugu News